పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో ఉపయోగకరం

27-11-2026 | 07:49pm

పోచారం మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రెడ్యానాయక్

ఘట్ కేసర్, నవంబర్ 27 (విజయక్రాంతి) : ముఖ్యమంత్రి సహాయ నిధి(Chief Minister's Relief Fund) పేదలకు ఎంతగానో ఉపయోగపడు తుందని, పోచారం మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రెడ్యానాయక్ ఉన్నారు.  పోచారం డివిజన్ యంనంపేట్ కి చెందిన కుశంగల రూప రాజు ముదిరాజ్ ఇటీవల అనారోగ్యం కు గురై ఆసుపత్రిలో శాస్త్రా చికిత్సలు జరిగి వారు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఎమ్మెల్యే మల్లారెడ్డి ని సంప్రదించారు.

మల్లారెడ్డి వారితో ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేయించడంతో రూ. 40వేల 500 మంజూరి అయ్యాయి. అట్టి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును శుక్రవారం లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి శేఖర్ ముదిరాజ్, మాజీ కౌన్సిలర్లు సింగిరెడ్డి సాయిరెడ్డి, చింతల రాజశేఖర్, నాయకులు నర్రి కాశయ్య  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు