భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకే భూ భారతి చట్టం
మేడ్చల్ జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి
ఘట్ కేసర్, నవంబర్ 27 (విజయక్రాంతి): రైతుల భూ సమస్యలకు(Farmers' land issues) శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు భూ రికార్డుల్లో(Land Record) పారదర్శకత తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టం(Bhu Bharati Act), భూముల రీ-సర్వే ప్రక్రియను చేపట్టిందని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ డి. విజయేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఘట్ కేసర్ డివిజన్(Ghatkesar Division) పరిధిలోని పడమటి సాయిగూడ గ్రామంలో నిర్వహించిన భూ భారతి-భూ సర్వే ప్రత్యేక గ్రామసభకు అదనపు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి అంగుళం భూమిని పారదర్శకంగా సర్వే చేసి, భూ వివాదాలకు తావు లేకుండా పక్కాగా హద్దులు నిర్ణయిస్తామని తెలిపారు.
రీ-సర్వే అనంతరం క్యూఆర్ కోడ్, నక్షా (మ్యాప్), భూ ఆధార్ అనుసంధానంతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందజేస్తామని వివరించారు. రైతులు ఎలాంటి అపోహలకు గురికాకుండా తమ భూములకు సంబంధించిన పత్రాలను అధికారులకు అందజేసి, సర్వే ప్రక్రియకు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. రీ-సర్వే అనంతరం క్యూఆర్ కోడ్, నక్షా (మ్యాప్), భూ ఆధార్ అనుసంధానంతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందజేస్తామని వివరించారు.
ఈకార్యక్రమంలో కీసర ఆర్డీవో నల్ల వెంకటరెడ్డి, ఘట్ కేసర్ తహసిల్దార్ చంద్రశేఖర్, ఘట్ కేసర్ మున్సిపల్ మాజీ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, రెవెన్యూ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.