హెచ్ఎండీఏకు నిరాశ.. బిడ్డర్లు కరువు
హైదరాబాద్: నగరంలో విలువైన భూముల విక్రయానికి హెచ్ఎండీఏ చేపట్టిన ప్రయత్నానికి ఆశించిన స్పందన రాలేదు. కోకాపేట నియోపోలిస్‌లోని 4.59 ఎకరాల భూమి ఈ-వేలంలో పాల్గొనేందుకు ఒక్క బిడ్డర్ కూడా ముందుకు రాలేదు. దీంతో అధికారులు వేలం ప్రక్రియను రద్దు చేశారు.
కోకాపేట నియోపోలిస్ లేఅవుట్లోని ప్లాట్ నంబర్ 17కు సంబంధించి హెచ్ఎండీఏ వేలం నిర్వహించింది. ఎకరాకు కనీస ధరను రూ.120 కోట్లుగా నిర్ణయించింది. నవంబర్ 27న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ-వేలం జరిగినప్పటికీ బిడ్లు దాఖలు కాలేదు.
ఇదే భూమికి గతంలో నిర్వహించిన వేలంలోనూ ఆశించిన పోటీ కనిపించలేదు. తాజాగా మరోసారి బిడ్డర్లు ముందుకు రాకపోవడంతో భూముల విక్రయ ప్రక్రియకు బ్రేక్ పడింది. వేలానికి స్పందన తగ్గడానికి గల కారణాలపై రియల్ ఎస్టేట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. హెచ్ఎండీఏ తదుపరి వేలం నిర్వహణపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.