ఉత్సాహంగా స్కంద ట్రై స్పోర్ట్స్ ఛాంపియన్షిప్

31-10-2026 | 05:05am

హైదరాబాద్, అక్టోబర్ 30: విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసి, భవిష్యత్తులో దేశానికి ఒలింపియన్లను అందించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న స్కంద ఇంటర్ స్కూల్(Skanda Inter-School) ట్రై స్పోర్ట్స్ చాంపియన్‌షిప్. ఘనంగా ప్రారంభమైంది. స్కంద ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో 7H స్పోర్ట్స్ ఈవెంట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ నిర్వహిస్తున్న ఈ రెండు రోజుల క్రీడా పోటీల్లో  నగరంలోని సుమారు 40 పాఠశాలల నుంచి దాదాపు 200 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.

ఈ సందర్భంగా 7H స్పోర్ట్స్ వ్యవస్థాపకులు, డైరెక్టర్ వెంకటేష్ మాట్లాడుతూ, చిన్న వయస్సు నుంచే విద్యార్థులకు సరైన క్రీడా వేదికలు, శిక్షణ మరియు పోటీ అనుభవం కల్పించడం ఎం తో అవసరం. గ్రామీణ ప్రాంతాలు, సాధార ణ కుటుంబాల నుంచి కూడా ఎంతో ప్రతిభ కలిగిన క్రీడాకారులు వస్తున్నారు. అలాంటి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా భవిష్యత్తులో దేశానికి ఒలింపియన్లను అం దించాలన్నదే మా లక్ష్యం. ప్రతి విద్యార్థికి క్రీడల్లో ఎదిగే అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో 7H స్పోర్ట్స్ కృషి చేస్తోందని తెలిపారు.

మరిన్ని వార్తలు