భారత్ జోరుకు బ్రేక్
- నాలుగో టీ20లో కివీస్ విజయం
- సెంచరీతో గ్లెన్ ఫిలిప్స్ విధ్వంసం
- న్యూజిలాండ్ భారీ స్కోరు
- చేజింగ్‌లో చేతుల్తేసిన భారత్
న్యూజిలాండ్ గడ్డపై టీ ట్వంటీ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలనుకున్న భారత్ ఆశలు నెరవేరలేదు. టీమిండియా జైత్రయాత్రకు బ్రేక్ వేస్తూ నాలుగో టీ ట్వంటీలో కివీస్ విజయం సాధించింది. భారీ టార్గెట్ చేజింగ్‌లో ఈ సారి భారత బ్యాటర్లు చేతులెత్తేశారు. ఫలితంగా ఆధిక్యం 3- తగ్గింది.
ఆక్లాండ్, అక్టోబర్ 30: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్(New Zealand)కు శుభారంభం దక్కలేదు. తొలి ఓవర్‌లోనే మయాంక్ యాదవ్ సీఫెర్ట్(3)ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. తన మరుసటి ఓవర్‌లో దూకుడుగా ఆడిన డారిల్ మిచెల్(24) కూడా ఔట్ చేశాడు. క్రీజులోకి వచ్చిన గ్లెన్ ఫిలిప్స్, ఫిన్ అలెన్‌తో దూకుడుగా ఆడటంతో... పవర్ ప్లేలో న్యూజిలాండ్ 2 వికెట్ల కు 67 పరుగులు చేసింది.
59 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని అక్షర్ పటేల్ విడదీసాడు. అయితే ఫిలిప్స్ మాత్రం దూకుడు కొ నసాగిస్తూ 31 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో బ్రేస్వెల్.. ఫిలిప్స్ తో కలిసి చెలరేగాడు. వీరిద్దరూ భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా భారత బౌలర్ల యార్కర్లు మిస్సవ్వడంతో న్యూజిలాండ్ బ్యాటర్లు పండుగ చేసుకున్నారు.
భారీ సిక్సర్లతో వేగంగా పరుగులు చేశారు. నితీష్ రెడ్డి వేసిన 16వ ఓవర్‌లో ఫిలిప్స్ నా లుగు భారీ సిక్స్‌లతో 32 పరుగులు పిండుకున్నాడు. ఫిలిప్స్, బ్రేస్వెల్ జోడి ఐదో వికెట్ కు కేవలం 41 బంతుల్లోనే 115 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత బౌలింగ్ లైన్‌అప్‌ను పూర్తిగా దెబ్బతీశారు. బ్రేస్వెల్ కేవలం 25 బంతుల్లోనే 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 65 పరుగులు చేసి కివీస్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఫిలిప్స్ కేవలం 49 బంతుల్లోనే 6 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 107 పరుగులు చేశాడు.
కివీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 259 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత బౌలర్లలో మయాంక్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టగా, మిగిలిన బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఈ భారీ లక్ష్య చేధనలో టీమిండియాకు శుభారంభం దక్కలేదు. ఇన్నింగ్స్ రెండో బంతికే సంజూ శాంసన్(4) క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. జాకోబ్ డఫీ వేసిన అదే ఓవర్‌లో ఇషాన్ కిషన్(0) డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ పరిస్థితుల్లో అభిషేక్ శర్మ, శ్రేయస్ అయ్య ర్ దూకుడుగా ఆడారు. అయితే అభిషేక్ శర్మను ఫిషర్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు.
ఆ వెంటనే శ్రేయస్ అయ్యర్(22)ను మిల్నే క్లీన్ బౌల్డ్ చేయడంతో పవర్ ప్లేలోనే భారత్ 4 వికెట్లు కోల్పోయింది. కివీస్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ బౌలింగ్‌లో నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్ వరుసగా ఔట్ కావడంతో ఓటమి ఖాయమైంది. భారత్ 9 వికెట్ల నష్టానికి 172 పరుగులకే పరిమితమయింది. న్యూజిలాండ్ బౌలర్లలో జాకబ్ డఫ్ఫీ కేవ లం 23 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టి భారత బ్యాటింగ్ వెన్నువిరిచాడు. శాంట్నర్, ఫిషర్ చెరో 2 వికెట్లు సాధించారు.
స్కోరు బోర్డు
న్యూజిలాండ్ ఇన్నింగ్స్ : 259/7 (గ్లెన్ ఫిలిప్స్ 107, బ్రేస్ వేల్ 65, అలెన్ 31; మయాంక్ యాదవ్ 3/48, అర్షదీప్ 1/38)
భారత్ ఇన్నింగ్స్ : 172/9 (తిలక్ వర్మ 35, నమన్ ధీర్ 28, అభిషేక్ శర్మ 27; డఫీ 4/24, ఫిషర్ 2/40)