రేపే టీ20..సంజూనా? సూర్యవంశీనా?
12-09-2026 | 03:27pm
అఫ్గానిస్థాన్‌తో టీమిండియా తొలి టీ20(T20)కు సిద్ధమవుతోంది. రేపు ఢిల్లీలో జరగనున్న మ్యాచ్‌లో అభిషేక్ శర్మతో(Abhishek Sharma) కలిసి ఓపెనింగ్ చేసేది ఎవరన్నదానిపై ఆసక్తి నెలకొంది. యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ కోసం సీనియర్ బ్యాటర్ సంజూ శాంసన్‌ను(Senior batter Sanju Samson) పక్కన పెట్టే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. అయితే ఏషియన్ గేమ్స్‌కు ముందు ఇద్దరికీ సమాన అవకాశాలు కల్పించే అవకాశం ఉందని క్రీడావర్గాలు భావిస్తున్నాయి.