పాంచజన్య సంకల్ప సభను విజయవంతం చేద్దాం
జడ్చర్ల, సెప్టెంబర్ 12, (విజయక్రాంతి): ఈ నెల 20న కొడంగల్ నియోజకవర్గం కోస్గిలోని కాలేజ్ గ్రౌండ్లో టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత నాయకత్వంలో నిర్వహించనున్న పాంచజన్య సంకల్ప సభ పోస్టర్ను శనివారం జడ్చర్లలో విడుదల చేశారు. సభ ఇన్చార్జ్ రంజిత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ సామాజిక న్యాయం, యువతకు ఉద్యోగాలు, విద్య, వైద్యం తదితర అంశాలపై చర్చించడమే పాంచజన్య ఉద్దేశమని తెలిపారు.
జడ్చర్ల నియోజకవర్గ ఇన్చార్జ్ బిర్లా ఎల్లయ్య యాదవ్ మాట్లాడుతూ జడ్చర్ల నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జడ్చర్ల నియోజకవర్గ ఇంచార్జ్ బిర్లా ఎల్లయ్య యాదవ్, శాగంటి మనోహర్ గౌడ్ -మహబూబ్ నగర్ జిల్లా యువత అధ్యక్షులు, దేవరకద్ర నియోజకవర్గం ఇంచార్జ్ దామోదర గౌడ్, జడ్చర్ల నియోజకవర్గ యూత్ అధ్యక్షులు ధీరజ్ కుమార్ ముదిరాజ్, కృష్ణ రెడ్డి TRS పార్టీ సీనియర్ నాయకులు, బాలానగర్ మండల నాయకులు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.