భిక్కనూర్‌లో ఉచిత మట్టి వినాయకుల పంపిణీ
భిక్కనూర్, సెప్టెంబర్ 12 (విజయ క్రాంతి): భిక్కనూర్ గాంధీచౌక్‌లో భారతి ఫౌండేషన్ చైర్మన్, డీసీసీ కార్యదర్శి లింగాల రాజబాబు గౌడ్ ఆధ్వర్యంలో శనివారం ఉచిత మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ఇల్యాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
జిల్లా గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్‌రెడ్డి, గ్రామ సర్పంచ్ రేఖ, సొసైటీ చైర్మన్లు ఇంద్రకరణ్‌రెడ్డి, భీంరెడ్డి, సుధాకర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుదర్శన్, ఉపసర్పంచ్ మోహన్‌రెడ్డి, ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు వెంకటేష్‌గౌడ్, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీరామ్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో గ్రామస్థులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.