ఎకో ఫ్రెండ్లీ గణేశ్ విగ్రహాల తయారీ
12-09-2026 | 04:02pm
నిర్మల్ సెప్టెంబర్ 12,(విజయ క్రాంతి): ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నిర్మల్‌లో ఎకో ఫ్రెండ్లీ గణేశ్(Eco-friendly Ganesha) విగ్రహాలను విద్యార్థులు ఆసక్తిగా తయారు చేశారు.పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు స్వయంగా గణేశ్ విగ్రహాలను రూపొందించారు.
ఈ కార్యక్రమాన్ని ఎన్‌ఎస్‌ఎస్ (జాతీయ సేవా పథకం) ఆధ్వర్యంలో డాక్టర్ కే.సూరౄసాగర్, డాక్టర్ ఎం. రజితా నిర్వహించారు. విద్యార్థులు ఎంతో ఆసక్తితో విగ్రహాలను రూపొందించారు. విద్యార్థుల ప్రతిభను ప్రొఫెసర్ ఎం. సుధాకర్ అభినందించారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ యు. గంగాధర్, రమేశ్ రెడ్డి, హేమలత, శ్రీహరి, సుభాష్, అర్చన, త్రిపాటి, నరేంద్ర్, పవన్ తదితరులు పాల్గొన్నారు.