విద్యుత్ కోతలపై రోడ్డెక్కిన రైతన్నలు
12-09-2026 | 04:05pm
161 జాతీయ రహదారిపై రాస్తారోకో
నిజాంసాగర్ సెప్టెంబర్ 12( విజయ క్రాంతి): వ్యవసాయానికి తరచూ విద్యుత్ కోత(Power cut) విధిస్తుండడంతోనిరసనగా కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల రైతులు మంగళూరు గ్రామ శివారులోనీ జాతీయ రహదారి 161 పై రాస్థా రోకో నిర్వహించారు. మండలంలోని వెలగనూరు, మంగుళూరు, నర్సింగరావుపల్లి, గ్రామాలకు చెందిన రైతులు వ్యవసాయ విద్యుత్ సరఫరా లో అంతరాయం లేకుండా విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు.