కల్లుగీత కార్మికుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

30-10-2026 | 11:11pm

రూ.10 లక్షలు ఎక్స్ గ్రెషియా అందించాలి

పచ్చిమట్ల రవీందర్ గౌడ్, తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు

కోహెడ,(విజయక్రాంతి): కోహెడ గ్రామానికి చెందిన మార్క రాజమౌళి గౌడ్ (35) ఇటీవల తాటిచెట్టు నుంచి కల్లు తీస్తుండగా  పాము కాటుకు గురైయి మృతి చెందిన విషయం విదితమే. కాగా శుక్రవారం తెలంగాణ కల్లుగీతా కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు, బిఎస్పి పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్ మృతుని కుటుంబాన్ని పరామర్శించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మృతునికి భార్య, కూతురు, కొడుకు ఉన్నారని,  ప్రభుత్వం నుంచి బాధిత కుటుంబానికి రూ.10 లక్షలు ఎక్స్ గ్రేషియా అందె విదంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బబ్బురు శ్రీనివాస్ గౌడ్, కోహెడ మండల గౌడ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు, గోప గోని సుభాష్, బాలగోని కమలాకర్, మార్క లక్ష్మణ్, ప్రదీప్, విపాక శీను పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు