సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రి సమీక్ష
సత్తుపల్లి,(విజయక్రాంతి): సత్తుపల్లి నియోజకవర్గ(Sattupalli constituency) సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సత్తుపల్లి పట్టణంలోని ద్వారకాపురి కాలనీ 07లో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ఈ సమావేశంలో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, వివిధ శాఖల పరిధిలో ఉన్న సమస్యలు, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించే అంశాలపై మంత్రి అధికారులతో చర్చించారు.
ఆయా శాఖల అధికారులు తమ శాఖల పరిధిలోని అంశాలను సమావేశంలో వివరించారు. ఈ సమావేశంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర ఐఏఎస్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి. శ్రీనివాసరెడ్డి, కల్లూరు ఆర్డీవో అజయ్ యాదవ్, సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ మహమ్మద్ రెహానా కమల్ పాషా, మున్సిపల్ వైస్ చైర్మన్ బొంతు సుమలత వేణు, మున్సిపల్ కమిషనర్ నరసింహ, రెవెన్యూ, విద్యుత్ శాఖల అధికారులు, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాదె చెన్నకేశవరావుతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.