గంజాయి విక్రయాలపై పోలీసుల దాడులు

31-10-2026 | 12:33am

ఏడుగురిపై NDPS చట్టం కింద కేసులు

40 గ్రాముల గంజాయి స్వాధీనం

జడ్చర్ల: జడ్చర్ల పోలీస్ స్టేషన్(Jadcherla Police Station) పరిధిలో గంజాయి విక్రయాలకు(Ganja Sale) సంబంధించి పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఏడుగురు వ్యక్తులను గుర్తించి వారిపై కేసులు నమోదు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు చేపట్టిన తనిఖీల్లో ఒక వ్యక్తి వద్ద సుమారు 40 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణలో సదరు వ్యక్తి మహారాష్ట్రకు చెందిన మరో వ్యక్తి నుంచి గంజాయిని తీసుకువచ్చి జడ్చర్ల ప్రాంతంలో విక్రయిస్తున్నట్లు వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న మొత్తం ఏడుగురు వ్యక్తులపై NDPS చట్టం కింద కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టారు.

గంజాయి సరఫరా ఎక్కడి నుంచి జరుగుతోంది, ఇందులో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉంది, విక్రయాల వెనుక ఉన్న నెట్‌వర్క్ తదితర అంశాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలను అరికట్టేందుకు తనిఖీలు కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు.యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని జడ్చర్ల పోలీసులు సూచించారు. గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలకు సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిసినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు