రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు
తాడ్వాయి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడువాయి మండలం దేవాయిపల్లి గ్రామ సమీపంలోని దేవాయిపల్లి రోడ్డులో శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డారు.వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని చిట్యాల గ్రామానికి చెందిన గనిషం గోపాల్ చిట్యాల నుంచి తన బైక్ పై పని నిమిత్తం బ్రాహ్మణపల్లి గ్రామానికి వెళుతున్నాడు.కామారెడ్డి పట్టణానికి చెందిన ఓ ప్రైవేటు పాఠశాల బస్సు దేవాయిపల్లి నుంచి తాడ్వాయికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదవశాత్తు ఎదురు ఎదురుగా బస్సు బైకు లు ఢీకొన్నాయి.ఈ ప్రమాదంలో బైక్ ముందు భాగం నుజ్జు నజ్జయింది. దీంతో యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే చికిత్స కోసం ఆయనను కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు.