మాజీ మావోయిస్టు నేత కంకణాల రాజిరెడ్డికి ఇంటి స్థలం

31-10-2026 | 12:05am

పునరావాసంలో భాగంగా 250 చదరపు గజాల స్థలం కేటాయింపు

భార్య రామ్‌కీకి కూడా పట్టా అందజేత

పెద్దపల్లి,(విజయక్రాంతి): మావోయిస్టు ఉద్యమాన్ని వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చిన మాజీ మావోయిస్టు నేత కంకణాల రాజిరెడ్డి(Former Maoist leader Kankanal Rajireddy) అలియాస్ వెంకటేష్‌కు రాష్ట్ర ప్రభుత్వం పునరావాస చర్యల్లో భాగంగా ఇంటి స్థలాన్ని కేటాయించింది. ఆయనతో పాటు ఆయన సతీమణి మాజీ మావోయిస్టు రామ్‌కీకి కూడా 250 చదరపు గజాల ఇంటి స్థలానికి సంబంధించిన పట్టాను అధికారులు అందజేశారు. పెద్దపల్లి(Peddapalli) జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన కంకణాల రాజిరెడ్డి ఇటీవల మావోయిస్టు పార్టీకి లొంగిపోయారు. ప్రభుత్వ పునరావాస విధానంలో భాగంగా ఆయన కుటుంబానికి జీవనోపాధి, నివాస వసతి కల్పించే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు.

ఈ మేరకు సర్వే నంబర్ 597లో స్థలాన్ని కేటాయించి, సంబంధిత పట్టాను తహసీల్దార్ కార్యాలయంలో అందజేశారు. ఇప్పటికే స్థల సేకరణ ప్రక్రియ పూర్తిచేసి పట్టా అందించినట్లు కాల్వశ్రీరాంపూర్ తహసీల్దార్ రాముడు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పాలన అధికారి అనిల్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ వినోద్ తదితరులు పాల్గొన్నారు. లొంగిపోయిన వారికి పునరావాసం కల్పించి సాధారణ జీవితం గడిపేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో భాగంగా ఈ పరిణామం చోటుచేసుకుంది.

మరిన్ని వార్తలు