రైతుల సమస్య పరిష్కారానికి కలెక్టర్‌ను కలిసిన సామ రూపేష్ రెడ్డి
31-10-2026 | 12:16am
బేల,(విజయక్రాంతి): మండలంలోని మశాల (కె) గ్రామపంచాయతీ పరిధిలోని బోర్గావ్ గ్రామంలో రైతుల పొలాలకు వెళ్లే దారిలో కల్వర్టు నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలని సామ రూపేష్ రెడ్డి శుక్రవారం జిల్లా కలెక్టర్ రాజర్షిషా ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పటికీ అటవీశాఖ అభ్యంతరాలతో పనులు నిలిచిపోయాయని వివరించారు. కల్వర్టు నిర్మాణం పూర్తికాక రైతులు, ముఖ్యంగా వర్షాకాలంలో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సంబంధిత శాఖలతో సమన్వయం చేసి త్వరగా అనుమతులు ఇప్పించి నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.