ప్రజల కల సాకారం చేసిన ఎమ్మెల్యే జీఎంఆర్
31-10-2026 | 12:24am
దేవరకద్ర: నియోజకవర్గం కౌకుంట్ల మండలం దాసరిపల్లి గ్రామ ప్రజల ఎన్నో ఏళ్ల కల నెరవేరింది. మహబూబ్‌నగర్ నుంచి అప్పంపల్లి మీదుగా ఆత్మకూరుకు వెళ్లే ఆర్టీసీ బస్సును దాసరిపల్లి మీదుగా నడిపించేలా ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (జీఎంఆర్) కృషి చేశారు. నూతన బస్సు సర్వీసును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. బస్సు సౌకర్యంతో విద్యార్థులు, రైతులు, గ్రామ ప్రజలకు ఎంతో ప్రయోజనం కలగనుంది. అనంతరం గ్రామంలో పలు సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీని ఎమ్మెల్యే ప్రారంభించారు. గ్రామస్తులు డప్పు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు.