పౌష్టిక ఆహారమే కీలకం

18-09-2026 | 08:42pm

- ఏసిడిపిఓ సుచరిత 

సిద్దిపేట (విజయక్రాంతి): కిశోర బాలికలకు, గర్భిణి, బాలింతలకు, మహిళలకు పౌష్టిక ఆహారమే అత్యంత కీలకమని సిద్దిపేట ఎసిడిపిఓ సుచరిత సూచించారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా ఇబ్రహీం నగర్ ఐసిడిఎస్ సెక్టార్ సూపర్వైజర్ సుజాత(ACDPO Sucharitha) ఆధ్వర్యంలో పౌష్టిక వారోత్సవాలు నిర్వహించారు. గర్భిణీలకు సామూహిక శ్రీమంతాలు, అంగన్వాడి కేంద్రాల్లో అడ్మిషన్ పొందిన పిల్లలకు అక్షరాభ్యాసం, పసి పిల్లలకు అన్నప్రాసన, రెండవ కాన్పులో పుట్టిన ఆడపిల్లలకి బేబీ కిడ్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఏసీడీపీఓ సుచరిత మాట్లాడుతూ పౌష్టికాహారం తీసుకోవడం వల్ల తల్లికి, పుట్టే బిడ్డలకు సంపూర్ణ ఆరోగ్యం కలిగి ఉంటుందని చెప్పారు. 

మరిన్ని వార్తలు