కూతురితో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు

18-09-2026 | 10:04am

నాగిరెడ్డిపేట్,సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): అత్త కోడళ్ళ మధ్య తలెత్తిన చిన్నపాటి గొడవకు మనస్థాపానికి చెందిన కోడలు తన కూతురుతో కలిసి పోచారం ప్రధాన కాలువలో(Pocharam main canal) దూకి ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు స్థానిక పోలీసులకు సమాచారం తెలియడంతో పోలీసులు సకాలంలో స్పందించి కాపాడారు. పోలీసులు కథనం ప్రకారం... మండలంలోని మాల్తుమ్మెద గ్రామానికి చెందిన బందేల్లి సువర్ణ తన కుమార్తె గౌరమ్మకు సంబంధించిన ఆధార్ కార్డు అప్డేట్(Aadhaar Card Update) చేయించుకోవడానికి గురువారం తన అత్త వెంకమ్మతో కలిసి ఎల్లారెడ్డి వెళ్ళింది.

తిరుగు ప్రయాణంలో అత్త వెంకమ్మ కోడలు సువర్ణ మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. దీనితో మనస్థాపానికి చెందిన సువర్ణ గురువారం రాత్రి గోపాల్పేట్లో బస్సు దిగిన వెంటనే కుమార్తె గౌరమ్మను తీసుకుని సమీపంలోని పోచార ప్రధాన కాలువలో దూకి ఆత్మహత్యకు చేసుకునేందుకు వెళ్ళింది.గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.నాగిరెడ్డిపేట మండల ఎస్సై భార్గవ్ గౌడ్ ఆదేశాల మేరకు కానిస్టేబుల్ దక్షిణామూర్తి హోమ్ గార్డ్ శేఖర్ వెంటనే సంఘటన స్థలాలకు చేరుకొని తల్లి కుమార్తెలను కాపాడారు.అనంతరం నాగిరెడ్డిపేట్ పోలీస్ స్టేషన్లో ఇరువురిని అత్త వెంకమ్మకు అప్పచెప్పారు.

మరిన్ని వార్తలు