వెదురు వస్తువుల వినియోగంతో పర్యావరణ పరిరక్షణ
ఆసిఫాబాద్ , సెప్టెంబర్ 18(విజయ క్రాంతి): వెదురుతో తయారు చేసిన వస్తువులను వినియోగించడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని జిల్లా కలెక్టర్ కె.హరిత (District Collector K. Haritha) అన్నారు. ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. మేదరులు తయారు చేసే వెదురు వస్తువులు చౌకగా లభిస్తాయని, వాటిని కొనుగోలు చేసి మేదర కుటుంబాలను ప్రోత్సహించాలని సూచించారు.
వారి సమస్యల పరిష్కారానికి అటవీ శాఖ అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని తెలిపారు.అనంతరం మేదరులు తయారు చేసిన వివిధ వస్తువులను కలెక్టర్ పరిశీలించగా, సంఘ నాయకులు వెదురుతో తయారు చేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమను ఆమెకు అందజేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి నదీమ్, సీపీఓ గురువయ్య, మేదర సంఘం ప్రతినిధులు కనకయ్య, డీకొండ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.