క్షయ రహిత సమాజం కోసం విస్తృతంగా వైద్య పరీక్షలు..

18-09-2026 | 10:04pm

62 మందికి వైద్య పరీక్షలు..                         

42 మందికి క్షయ నిర్ధారణ పరీక్షలు

వెంకటాపురం (నూగూరు) సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): క్షయ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా ఏదిరా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని తిప్పాపురం ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌లో శుక్రవారం జాతీయ క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షల శిబిరాన్ని(National Tuberculosis Diagnostic Testing Camp) నిర్వహించారు.

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ గోపాలరావు, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రవితేజ ఆదేశాల మేరకు గ్రామపంచాయతీ సర్పంచ్ చందా శిరీష, ఉపసర్పంచ్ సభక సుశీల ఆధ్వర్యంలో శిబిరం నిర్వహించారు. రెండు వారాలకు మించి దగ్గు, రాత్రిపూట జ్వరం, తెమడలో రక్తం పడటం, ఆకలి మందగించడం వంటి లక్షణాలు ఉన్న వారికి ప్రత్యేకంగా తెమడ పరీక్షలు, ఛాతీ ఎక్స్‌రే స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు.

శిబిరానికి హాజరైన వారికి రక్తపోటు, మధుమేహ పరీక్షలు కూడా నిర్వహించి, అవసరమైన వారికి నెలవారీ మందులను అందజేశారు. మొత్తం 62 మంది శిబిరంలో పాల్గొనగా,42 మందికి క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు వైద్య సిబ్బంది తెలిపారు.

మరిన్ని వార్తలు