అన్నదానం మహాదానం

18-09-2026 | 09:42pm

సీనియర్ సివిల్ జడ్జి ఆర్. అజయ్ కుమార్

మెట్ పల్లి, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): అన్నదానం అనేది ఒక మహాత్కార్యం మహాదానం అని సీనియర్ సివిల్ జడ్జి ఆర్. అజయ్ కుమార్ (Senior Civil Judge R. Ajay Kumar) అన్నారు.శుక్రవారం మెట్ పల్లి కోర్ట్ కాంప్లెక్స్ లో (MetPally Court Complex) వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్న ప్రసాద కార్యక్రమాన్ని ఆయన కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఆయన ప్రత్యేక వినాయక పూజలో పాల్గొని మాట్లాడుతూ అన్న దానం అనేది ఒక మహాత్కార్యం అని, అన్ని దానాలలో కన్న అన్నదానం మాత్రమే గొప్ప దానం అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమం లో బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలేటి రాంరెడ్డి, ప్రధాన కార్యదర్శి నల్ల రాజేందర్, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెర్లపల్లి ఆనంద్ గౌడ్, న్యాయవాదులు కంతి మోహన్ రెడ్డి, వడ్డేపల్లి శ్రీనివాసన్, జిల్లా వెంకటేశ్వర్లు, గండ్ర ప్రవీణ్ రావు, పుప్పాల రాంభూపాల్, గడ్డం శంకర్ రెడ్డి, బద్దం లక్ష్మా రెడ్డి, పోలకొండ దయాకర్ వర్మ, బోడ లక్ష్మణ్, పుప్పాల భానుమూర్తి, తోగిటి రాజశేఖర్ కోర్ట్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు