గ్రామాలలో పర్యటించి వివరాలు తెలుసుకున్న.. ఎంపీడీవో ప్రవీణ్ కుమార్

18-09-2026 | 09:56pm

బెజ్జూర్ సెప్టెంబర్ 18 (విజయ క్రాంతి): బెజ్జూర్ మండలము లోని  చేయూత పెన్షన్ 560 దరఖాస్తులు స్వీకరించినట్లు ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ (MPDO Praveen Kumar)తెలిపారు.ప్రభుత్వం ఆదేశానుసారం ఫీల్డ్ వెరిఫికేషన్ ను  4 గురు అధికారుల కు మండల పరిషత్ అభివృద్ధి అధికారి, అగ్రికల్చర్ అధికారి , డిప్యూటీ తహసీల్దార్ , మండల ఎడ్యుకేషన్ అధికారులను కేటాయించగా శుక్రవారం వరకు 86 దరఖాస్తులను పరిశీలించినట్లు తెలిపారు. లంబాడిగూడ, రెబ్బెన పంచాయతీ లలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి బిఎస్. ప్రవీణ్ కుమార్ పర్యటించి పరిశీలించినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు