ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయి

18-09-2026 | 06:04pm

హైదరాబాద్: రంగనాయకసాగర్(Ranganayaka Sagar) పరిసరాల్లో కాంగ్రెస్ ఎంపీల(Congress MPs) బృందం శుక్రవారం పర్యటించింది. సిద్దిపేటలోని చిన్నకోడూరు మండలం రామంచ శివారులోని భూములను, బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు(Former Minister Harish Rao) ఫామ్ హౌస్ పరిసరాలను పరిశీలించారు. హరీష్ రావు అధికార దర్వినియోగానికి పాల్పడ్డారని రంగనాయకసాగర్ కు సేకరించిన భూమిలో 13.12 ఎకరాల్లో ఫాంహౌస్ కట్టుకున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. రూ.5.30 కోట్లతో ఫామ్ హౌస్ చుట్టూ రోడ్డు వేసుకున్నారని, సుడా నిధులతో హరీష్ రావు ఫామ్ హౌస్ కు రోడ్డు వేసుకున్నారని తెలాపారు. ప్రజలు లేని చోట సుడా డబ్బుతో పార్కు ఎందుకు కట్టారు?, హరీష్ రావుకు ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పాలని ఎంపీ చామల ప్రశ్నించారు. 

మరిన్ని వార్తలు