ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో
18-09-2026 | 05:31pm
హైదరాబాద్: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్(MLA Danam Nagender)పై హైకోర్టు తీర్పును స్వాగతీస్తున్నామని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి(Alleti Maheshwar Reddy) పేర్కొన్నారు. బీజేపీ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతుందని, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకునే వారికి కోర్టు తీర్పు చెంపపెట్టులాంటిదని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ(Congress Party) బుద్దు తెచ్చుకోవాలని, మిగిలిన వాళ్లతో రాజీనామా చేయించి ఉపఎన్నికలకు వెళ్లాలని మహేశ్వర్ రెడ్డి సూచించారు. దానం నాగేందర్ సుప్రీంకోర్టుకు వెళ్లకుండా రాజీనామా చేయాలని, మేము రేపు సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ వేస్తామన్నారు.