గోపనపల్లిలో పక్కకొరిగిన భవనం భవనం.. ఏ క్షణంలో కూలుతుందో?

18-09-2026 | 01:52pm

హైదరాబాద్: గచ్చిబౌలి గోపనపల్లిలో(Gopanpally) నాలుగంతస్తుల భవనం పక్కు ఒరిగింది. 40 నుంచి 50 గజాల స్థలంలో నాలుగు అంతస్తుల భవనం నిర్మించినట్లు స్థానికులు ఆరోపించారు. భవనం ఒకపైపు ప్రమాదకరంగా ఒరగడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న అధికారులు పక్కకు ఒరిగిన భవనాన్ని పరిశీలిస్తున్నారు. భవనం ఏ క్షణంలో కూలుతుందోనన్న స్థానికులు భయపడుతున్నారు. మున్సిపల్ అధికారులు(Municipal officials) భవనం కూల్చివేతకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రమాదం జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇటీవల మాదాపూర్​ పరిధిలోని అంజయ్యనగర్​లో నాలాను ఆక్రమించి 50 గజాల్లో నిర్మించిన 7 అంతస్తుల భవనం కూలిపోయిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు