బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ అరెస్ట్
హైదరాబాద్: బీఆర్ఎస్ సోషల్ మీడియా(BRS Social Media) కన్వీనర్ మన్నె క్రిశాంక్(Manne Krishank)ను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉదయం 5 గంటలకే క్రిశాంక్ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించి దౌర్జన్యంగా తలుపులు పగులగొట్టి ఇంట్లోకి చొరబడేందుకు యత్నించారు. ఈ నేపథ్యంలోనే క్రిశాంక్ ఇంటి వద్దకు చేరుకున్న బీఆర్ఎస్ లీగల్ సెల్ బృందం(BRS Legal Cell Team), భారీ సంఖ్యలో కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకుంటున్నారు.
నోటీసులు ఇవ్వకుండానే క్రిశాంక్‌ను అక్రమంగా అరెస్ట్ చేసేందుకు పోలీసుల యత్నిస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు, లీగల్ సెల్ న్యాయవాదులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సోషల్ మీడియాలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని(Congress government) ప్రశ్నిస్తూ ట్వీట్ పెట్టినందుకే రేవంత్ సర్కార్ దౌర్జన్యంగా క్రిషాంక్ ఇంటి గేట్ తలుపులు పగులగొట్టి అరెస్టు చేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.