తుంగతుర్తిలో గణేష్ మండపాల వద్ద భక్తులు ప్రత్యేక పూజలు
18-09-2026 | 09:34pm
తుంగతుర్తి (విజయ క్రాంతి): గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు, శుక్రవారం మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని గ్రామాల్లోని వినాయక మండపాల వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం కుంకుమ పూజ కార్యక్రమాలు, మణికంఠ యూత్ ఉత్సవ కమిటీ లో (Manikantha Youth Festival Committee)విగ్రహ దాత ,బిజెపి రాష్ట్ర నాయకులు సంకినేని రవీందర్రావు చేతుల మీదుగా అన్నదానం నిర్వహించారు.వెలుగు పెళ్లి రోడ్ లోని గణేష్ ఉత్సవ కమిటీలో గణేశుని పూజలో, పులుసు వెంకటనారాయణ గౌడ్ దంపతులు మాజీ గుడి చైర్మన్, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.