అనురాగ్ లో అవిన్యా–2కె26 జాతీయస్థాయి సాంకేతిక పోటీలు

18-09-2026 | 09:59pm

ఘట్ కేసర్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి) : అనురాగ్ యూనివర్సిటీకి( Anurag University)చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ విభాగం, ఇండియన్ సొసైటీ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో అవిన్యా 2కె26 రెండు రోజుల జాతీయస్థాయి సాంకేతిక కార్యక్రమం నిర్వహించారు. దేశవ్యాప్తంగా వివిధ విద్యా సంస్థలకు చెందిన 450 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో ఐఐటి మద్రాస్, ఎన్ఐటి లు, బిట్స్ పిలానీ, జేఎన్ టియుహెచ్ తదితర ప్రముఖ విద్యాసంస్థల విద్యార్థులు పాల్గొన్నారు.

తొలి రోజు కార్యక్రమాన్ని డి ఆర్ డి ఓ కు చెందిన శాస్త్రవేత్త-ఎఫ్ డి. శ్రావణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కార్యక్రమంలో హ్యాపెనిక్స్ వ్యవస్థాపకుడు సీఈవో జనార్దనచారి వినుకొండ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ డీన్ డాక్టర్ వి. విజయకుమార్, డైరెక్టర్ ఇండస్ట్రీ అలియన్సెస్ డాక్టర్ సిద్ధార్థ్ ఘోష్, ఏఐఎంఎల్ విభాగాధిపతి డాక్టర్ ఎ. మల్లికార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన జాతీయస్థాయి హ్యాకథాన్ లో ఏఐ  ఏజెంట్స్, ఏఐ ఇన్ హెల్త్కేర్, ఎథికల్ ఏఐ, జనరేటివ్ ఏఐ అంశాల్లో విద్యార్థులు వినూత్న పరిష్కారాలను అభివృద్ధి చేశారు.

మరిన్ని వార్తలు