గుండ్లపోచంపల్లిలో ఘనంగా కొత్త రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ
మేడ్చల్ అర్బన్ సెప్టెంబర్ 18(విజయక్రాంతి):గుండ్లపోచంపల్లి మున్సిపల్ డివిజన్ (Gundlapochampally Municipal Division) పరిధిలో శుక్రవారం పేద ప్రజలకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం వీఆర్వో ప్రభు,రేషన్ డీలర్ ల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని గుండ్లపోచంపల్లి మున్సిపల్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గరిసెల సురేందర్ ముదిరాజ్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక పేదల సంక్షేమమే లక్ష్యంగా సిఎం ఎనుముల రేవంత్ రెడ్డి పాలన సాగిస్తున్నారని ఆయన చెప్పారు.గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డులు రాకా ఇబ్బంది పడుతున్న ఎంతో మంది పేదలకు నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ స్మార్ట్ కార్డులు పంపిణీ చేసి ప్రజలకు అండగా నిలిచిందని ఆయన స్పష్టం చేశారు.
ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలు రేషన్ స్మార్ట్ కార్డు
అర్హులైన ప్రతి పేద కుటుంబానికి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని చెప్పి అమలు చేయడం జరిగిందని సురేందర్ ముదిరాజ్ తెలిపారు.అందులో బాగంగా మహాలక్ష్మి,గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు,రూ 500 గ్యాస్ సిలిండర్,రైతు భరోసా,రుణమాఫీ,రాజీవ్ యువ వికాసం,లాంటి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం జరిగిందని ఆయన వెల్లడించారు.ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ పేదల పక్షాన నిలుస్తుందని అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తామని సురేందర్ ముదిరాజ్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గుండ్లపోచంపల్లి గ్రామ మాజి సర్పంచ్ లు బేరీ ఈశ్వర్.బండారి నరేందర్ ముదిరాజ్.మేడ్చల్ జిల్లా ఓబీసీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గువ్వ రవి ముదిరాజ్.శ్రీశ్రీశ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు గడిలా కృష్ణా రెడ్డి.మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బొజ్జ ఆదిలక్ష్మి.జిల్లా మహిళా కాంగ్రెస్ కార్యదర్శి మరిలమ్మ.యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీరంగవరం నవీన్ ముదిరాజ్. మాజి ఎంపీటీసీ పులిగిల్ల రాజేశ్వర్.మాజి ఉపసర్పంచ్ చిల్ల వెంకటేష్ ముదిరాజ్.ఎల్ రవీందర్ గౌడ్.వీరస్వామి.సంపత్ యాదవ్.లతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు...
1)గుండ్లపోచంపల్లి మున్సిపల్ పట్టణంలో పేద ప్రజలకు కొత్త రేషన్ స్మార్ట్ కార్డులను పంపిణీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు..