ప్రతి రైతుకు భూధార్, సర్వే మ్యాప్

30-10-2026 | 06:17pm

ములుగు మండలం గంగాధర్ పల్లి భూ రీసర్వే గ్రామసభలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మి కిరణ్

గజ్వేల్, అక్టోబర్ 30:  వ్యవసాయం చేసే ప్రతి రైతుకు భూదార్ తో పాటు సర్వే మ్యాప్ ను అందజేయడం జరుగుతుందని సిద్దిపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్(Additional Collector Lakshmi Kiran) అన్నారు. ములుగు మండలం గంగాధర్ పల్లి గ్రామంలో శుక్రవారం భూభారతి రి సర్వే కోసం గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతుల భూముల లెక్కను పక్కాగా తేల్చి చెప్పడానికి, ప్రభుత్వ భూముల రక్షణ కోసం భూభారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

దశాబ్దాల క్రితం ఏర్పాటుచేసిన సర్వే నెంబర్లు హద్దులలో చాలా మార్పులు వచ్చాయని, మరోసారి లెక్క తేల్చి రైతుల భూ రికార్డులను సరి చేయడం వల్ల రైతులకు మేలు జరుగుతుందన్నారు. భూ భారతి రి సర్వే అనంతరం రైతుల యొక్క భూమి వివరాలతో కూడిన భూధార్ కార్డును, సర్వే చేసిన నక్షా కూడా రైతుకు అందజేస్తామన్నారు. రైతులు భూ యజమానులు రి సర్వేకు సహకరించి సర్వేను చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో తహసిల్దార్ రవీందర్ రెడ్డి, ఆర్ ఐ నర్సింలు, గ్రామ సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి, సర్వే అధికారులు గ్రామస్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు