ఆరోగ్యమే మహాభాగ్యం.. ఆహారమే ఆయుధం!
- గజ్వేల్ డిగ్రీ కాలేజీలో ఘనంగా ఫుడ్ ఫెస్టివల్
గజ్వేల్: పోషక విలువలు, ఆహార పరిశుభ్రతపై విద్యార్థుల్లో(Students) అవగాహన కల్పించేందుకు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్(Gajwel Government Degree College) అటానమస్, గజ్వేల్‌లో మైక్రోబయాలజీ విభాగం ఆధ్వర్యంలో గురువారం ఫుడ్ ఫెస్టివల్(Food Festival)ను ఘనంగా నిర్వహించారు. మైక్రో బయాలజీ ఇంచార్జ్ లావణ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డా. నిఖత్ అంజుమ్, వైస్ ప్రిన్సిపాల్ డా. గణపతి, మైక్రోబయాలజీ విభాగాధిపతి డా. అలివేలు హాజరై విద్యార్థులను అభినందించారు.
ఫుడ్ ఫెస్టివల్‌లో విద్యార్థులు సుమారు 30 రకాల తెలంగాణ, భారతీయ సంప్రదాయ వంటకాలు, వివిధ రకాల పండ్లను ప్రదర్శించారు. ప్రతి ఆహార పదార్థంలోని పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలు, ఆహార పరిశుభ్రతపై వివరించారు. కార్యక్రమం విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీయడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై ఆసక్తిని పెంచింది. ఉత్తమ ప్రదర్శనలు చేసిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పలువురు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఫుడ్ ఫెస్టివల్‌ను విజయవంతంగా నిర్వహించిన మైక్రోబయాలజీ విభాగాన్ని కళాశాల ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, అధ్యాపకులు అభినందించారు.