కవలల రాక.. తండ్రి సూపర్ సర్‌ప్రైజ్!

08-10-2026 | 04:15pm

ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. ఇంట్లోకి కవల పిల్లలు(Twins) రావడంతో ఓ తండ్రి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే ఈ సంతోషాన్ని తన కుటుంబానికే పరిమితం చేయకుండా సేవా కార్యక్రమంతో మరింత ప్రత్యేకంగా మార్చారు. కవల చిన్నారుల బరువుకు సమానమైన మొత్తంలో నగదును తూకం వేసిన ఆ తండ్రి.. ఆ మొత్తాన్ని పూర్తిగా ఛారిటీల(Charity )కు విరాళంగా అందించారు. 

పిల్లల రాకను గుర్తుండిపోయేలా చేసుకోవడంతో పాటు, అవసరమైన వారికి అండగా నిలిచేలా ఆయన తీసుకున్న నిర్ణయంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, ప్రదేశం ఇంకా తెలియలేదు. అయితే తండ్రి చేసిన ఈ వినూత్న పని చూపించే వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కవలల రాకను సేవతో సెలబ్రేట్ చేసిన ఈ తండ్రి ఆలోచనకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.


మరిన్ని వార్తలు