ఓవర్‌హాలింగ్ పనులను పునరుద్ధరించిన పవర్ ట్రాన్స్‌ఫార్మర్

08-10-2026 | 11:11pm

జగన్నాధపురం 33/11 కేవీ సబ్‌స్టేషన్‌లో 3.15 ఎంవీఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్ ఛార్జింగ్

పాల్వంచ,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem district) పరిధిలోని పాల్వంచ రూరల్ ఆపరేషన్ సెక్షన్‌లో గల జగన్నాధపురం 33/11 కేవీ సబ్‌స్టేషన్‌(Jagannadhapuram Substation)లో 3.15 ఎంవీఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌ను గురువారం సర్కిల్ సూపెరింటెండింగ్ ఇంజనీర్ గొట్టిముక్కల  .మహేందర్ విజయవంతంగా ఛార్జ్ చేశారు. ఈ సందర్బంగా ఎస్ఈ మాట్లాడుతూ... సబ్‌స్టేషన్‌లో పవర్ ట్రాన్స్‌ఫార్మర్ సామర్థ్యం అందుబాటులోకి వచ్చి సంబంధిత ప్రాంతంలో విద్యుత్ సరఫరా వ్యవస్థ మరింత బలోపేతం కానుందన్నారు.

పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఛార్జ్ చేసే సమయంలో దాని పనితీరు, రక్షణ వ్యవస్థలు, విద్యుత్ సరఫరా పరిస్థితిని అధికారులు సమగ్రంగా పర్యవేక్షించారు. ఓవర్‌హాలింగ్ అనంతరం ట్రాన్స్‌ఫార్మర్‌ను విజయవంతంగా సేవల్లోకి తీసుకురావడం ద్వారా సబ్‌స్టేషన్ నిర్వహణ సామర్థ్యం మెరుగుపడటంతో పాటు వినియోగదారులకు నాణ్యమైన, విశ్వసనీయ విద్యుత్ సరఫరా అందించేందుకు దోహదపడనుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఈ/ఎం&సీ/కేజీఎం, డీఈ/ఆపరేషన్స్/పీవీసీ, ఏడీఈ/ప్రొటెక్షన్ & టి ఆర్ ఈ ఏడీఈ/ఆపరేషన్స్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు