ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి!

08-10-2026 | 05:11pm

హైదరాబాద్: నగరంలోని బాలానగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో స్కూటీపై వెళ్తున్న ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. బాలానగర్ ఫ్లైఓవర్ కింద ఐరన్ పైపుల లోడ్‌తో వెళ్తున్న ఆటో వేగంగా యూటర్న్ తీసుకునే క్రమంలో అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో ఆటోలో ఉన్న భారీ పైపుల లోడ్ సమీపంలో వెళ్తున్న స్కూటీపై పడింది.

ఈ ప్రమాదంలో స్కూటీ నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఘటనతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వేగంగా యూటర్న్ తీసుకోవడమే ప్రమాదానికి కారణమని స్థానికులు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీ తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు