ఎన్నికల నిర్వహణపై డిపో మేనేజర్లతో సమీక్ష

08-10-2026 | 11:41pm

మేడిపల్లి,(విజయక్రాంతి): రాబోయే టీజీఎస్ఆర్టీసీ ఎన్నికల(TGSRTC Elections) సందర్భంగా గురువారం ఉదయం డిపో మేనేజర్లతో సిఐ జలంధర్ రెడ్డి(CI Jalandhar Reddy) సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశoలో ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో సున్నితంగా నిర్వహించడంపై చర్చ జరిపారు. పోలింగ్ బూత్‌ల ఏర్పాటు, సీసీటీవీ కెమెరాల పనితీరు పరిశీలన, కార్మిక సంఘాలతో సమన్వయం, ఓటర్ల వివరాల సేకరణ, అవసరమైన భద్రతా చర్యలపై సమీక్ష చేశారు.

పోలీసు శాఖతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ, ఎన్నికలు సజావుగా సాగేలా అన్ని ముందస్తు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను సిఐ జలంధర్ రెడ్డి ఆదేశించారు.ఈ సమావేశంలో ఎస్ఐలు ఉదయ్ భాస్కర్, ఏడుకొండలు, నర్సింగరావులతో పాటు చెంగిచర్ల డిపో మేనేజర్  స్వాతి, ఉప్పల్ డిపో మేనేజర్ రామ్ మోహన్, వర్క్‌షాప్ వర్క్స్ మేనేజర్ జకీర్ హుస్సేన్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు