జిమ్ జిమ్ తార.. కాలేజ్ ఎక్కడ చిన్నోడా
సోషల్ మీడియాలో(Social Media) ట్రెండింగ్‌లో ఉన్న “జిమ్ జిమ్ తార” పాటతో జగిత్యాల మెడికల్ కాలేజీ విద్యార్థులు వినూత్నంగా నిరసన తెలిపారు. పర్మినెంట్ కాలేజ్ బిల్డింగ్(Permanent College Building) నిర్మించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు.
“జిమ్ జిమ్ తార.. జిమ్ జిమ్ తార.. కాలేజ్ ఎక్కడ చిన్నోడా?” అంటూ పాటను ఆలపిస్తూ విద్యార్థులు తమ నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వారు కోరారు. సమస్య పరిష్కారం కోసం తమ డిమాండ్‌ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు వినూత్నంగా నిరసన చేపట్టినట్లు విద్యార్థులు తెలిపారు.
ఈ సందర్భంగా విద్యార్థులు చేపట్టిన నిరసన(Protest) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శాశ్వత ప్రాంగణం(Permanent Campus) కోసం తమ డిమాండ్‌ను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని విద్యార్థులు కోరారు.
"జిమ్ జిమ్ తార.. జిమ్ జిమ్ తార.. కాలేజ్ ఎక్కడ చిన్నోడా" జగిత్యాల మెడికల్ కాలేజీ విద్యార్థుల వినూత్న నిరసన సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్న "జిమ్ జిమ్ తార" పాటతో పర్మినెంట్ కాలేజ్ బిల్డింగ్ నిర్మించాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగిన జగిత్యాల మెడికల్ కాలేజీ విద్యార్థులు
— ShashanKTR1🚗 (@Shashanktrs8) October 8, 2026