అన్ని కులాల్లోని నిరుపేదలకూ రిజర్వేషన్లు దక్కాలి
ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్ల సాధనే లక్ష్యం
నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి
స్టేట్ కోఆర్డినేటర్
ఈ నెల 24 నుంచి రాష్ట్రంలో 'ఆర్ధిక రిజర్వేషన్ సాధన రథయాత్ర'
24న కామారెడ్డి లో బహిరంగ సభ.
26న పరకాలలో 15 వేల మందితో భారీ బహిరంగ సభ
కీసర వేదికగా 'సాధన కమిటీ' నాయకుల పిలుపు
కామారెడ్డి,(విజయక్రాంతి): స్వాతంత్య్రం వచ్చి ఎనిమిది దశాబ్దాలు కావస్తున్నా అన్ని వర్గాల్లోని అట్టడుగు నిరుపేదలకు ప్రభుత్వ ఫలాలు, రిజర్వేషన్లు అందడం లేదని, స్టేట్ కోఆర్డినేటర్ కర్ణాకర్ రెడ్డి(Coordinator Nallavelli Karunakar Reddy) అన్నారు. కులమతాలకు అతీతంగా ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయడమే ప్రధాన ధ్యేయంగా పోరాడుతున్నామని అన్నారు. 'ఆర్థిక ఆధారిత రిజర్వేషన్ల సాధన కమిటీ'(Economic Reservation Sadhana Committee) నాయకులు స్పష్టం చేశారు. గురువారం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర మండల కేంద్రంలో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర స్థాయి కమిటీ ప్రతినిధులు, వివిధ కుల సంఘాల నేతలు ఈ సందర్భంగా మాట్లాడినట్లు తెలిపారు. ఈనెల 24న తెలంగాణలోకి ఆర్ధిక రిజర్వేషన్ సాధన రథయాత్ర'(Economic Reservation Rath Yatra) ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
ప్రవీణ్ అరోరా నేతృత్వంలో ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద ప్రారంభమైన 20,000 కిలోమీటర్ల సుదీర్ఘ 'రథయాత్ర' ఈ నెల 24న నాగ్‌పూర్ మీదుగా ఆదిలాబాద్ వద్ద తెలంగాణలోకి ప్రవేశించనుందని రాష్ట్ర కో ఆర్డినేటర్ కరుణాకర్ రెడ్డి తెలిపారు. 24న నిర్మల్‌లో కార్నర్ మీటింగ్, కామారెడ్డిలో బహిరంగ సభ, 24న నిజామాబాద్ లో కార్నర్ మీటింగ్, కామారెడ్డి లో బహిరంగ సభ ఉంటుంది అన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట, తూప్రాన్ లలో కార్నర్ మీటింగ్ సమావేశాలు నిర్వహించి హైదరాబాద్ చేరుకుంటుందన్నారు.25న హైదరాబాద్ అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన అనంతరం, 26 న జనగామ, వరంగల్ మీదుగా పరకాల చేరుకొని సుమారు వేలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
ప్రత్యేక రాజ్యాంగ కమిషన్ ఏర్పాటు చేయాలి:
రాష్ట్ర కోఆర్డినేటర్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి, మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం వెంటనే ఒక ప్రత్యేక రాజ్యాంగ కమిషన్‌ను ఏర్పాటు చేసి చట్టబద్ధంగా ఆర్థిక ఆధారిత రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అట్టడుగున ఉన్న ప్రతీ పేదవానికి సంక్షేమ ఫలాలు అందే వరకు ఈ పోరాటం కొనసాగుతుందన్నారు. ఈ రథయాత్రకు మరియు ఆర్థిక ఆధారిత రిజర్వేషన్ల ఉద్యమానికి ప్రజలు, అన్ని వర్గాల నాయకులు పెద్ద ఎత్తున మద్దతు తెలపాలని వారు కోరారు.ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు ఏనుగు సంతోష్ రెడ్డి, పైళ్ల హరినాథ్ రెడ్డి ,బుట్టం గారి మాధవ రెడ్డి,రాష్ట్ర పలు కుల సంఘాల ప్రతినిధులు, నాయకులు పాల్గొంటారని తెలిపారు.