ప్రధాని మోదీ సేవా సంకల్ప అభియాన్

08-10-2026 | 11:35pm

మొక్కలు నాటిన బీజేపీ శ్రేణులు

యాదగిరిగుట్ట,(విజయకాంతి): భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) పాతికేళ్ల ప్రజా ప్రస్థానం, పాలనా కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమం(Seva Sankalp Abhiyan Program)ను మల్లాపురం(Mallapuram) గ్రామంలో ఘనంగా నిర్వహించారు. బీజేపీ గ్రామ శాఖ(BJP Village Unit) ఆధ్వర్యంలో గురువారం గ్రామంలో భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు ఫకీర్ రాజేందర్ రెడ్డి, మండల మాజీ అధ్యక్షులు గుంటుపల్లి సత్యం హాజరై మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశసేవలో ప్రధాని మోదీ అందిస్తున్న నిరంతర సేవలు ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని కొనియాడారు. పర్యావరణ పరిరక్షణతో పాటు వికసిత భారత్ నిర్మాణంలో భాగంగా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సేవా కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మాణిక్యం రెడ్డి, జిల్లా కార్యదర్శి గుజ్జుల చంద్ర శేఖర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి గోపగాని ప్రసాద్, బూత్ అధ్యక్షులు మంగ మహేందర్ పాల్గొన్నారు. వీరితో పాటు పార్టీ నాయకులు కంకల సిద్ధులు, వేముల మాధవ రెడ్డి, పల్లెపాటి బాలయ్య, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు