రాజ్‌ఘాట్‌లో సత్యాగ్రహం.. రేవంత్ హాజరు

08-10-2026 | 07:24pm

న్యూఢిల్లీ: ఢిల్లీలో ఇండి కూటమి నేతల నిరసన కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కూడా పాల్గొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు పలువురు విపక్ష నేతలు రాజ్‌ఘాట్‌కు చేరుకుని సత్యాగ్రహం(Rajghat Satyagraha)లో పాల్గొన్నారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అంశాలపై కేంద్ర ఎన్నికల సంఘంపై ఒత్తిడి పెంచేందుకు ఇండి కూటమి వరుసగా నిరసన కార్యక్రమాలు చేపడుతోంది.

ఈ క్రమంలోనే గురువారం రాజ్‌ఘాట్ వద్ద మహాత్మా గాంధీ స్మారక స్థలంలో నేతలు శాంతియుత నిరసన చేపట్టారు. గత రెండు రోజులుగా ఢిల్లీలో విపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఎన్నికల సంఘం, ముఖ్యంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ గ్యానేశ్ కుమార్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో ఇండి కూటమి నేతలు నిరసనలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొనడం తెలంగాణ రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తిని రేకెత్తించింది. రాజ్‌ఘాట్ సత్యాగ్రహంతో విపక్ష కూటమి తమ నిరసనను మరింత ఉధృతం చేసినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు