IPLతో మళ్లీ క్లాష్

08-10-2026 | 02:07pm

పాకిస్థాన్ క్రికెట్‌లో కీలక ప్రకటన.. PSL డేట్స్ లాక్!

PSL 2027: పాకిస్థాన్ క్రికెట్‌లో మరోసారి Pakistan Super League (PSL) సందడి మొదలుకానుంది. PSL 2027 12వ ఎడిషన్‌కు సంబంధించిన కీలక తేదీలను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఖరారు చేసింది. వచ్చే ఏడాది మార్చి 18 నుంచి మే 2 వరకు PSL 12 నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే PSL Schedule 2027పై క్లారిటీ రావడంతో క్రికెట్ ప్రపంచంలో ఆసక్తి పెరిగింది.

IPLతో మళ్లీ క్లాష్ తప్పదా?

PSL 2027 షెడ్యూల్‌లో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అంశం Indian Premier League (IPL)తో ఓవర్లాప్. మార్చి చివరి నుంచి మే వరకు సాధారణంగా IPL సీజన్ కొనసాగుతుండటంతో.. ఈసారి కూడా IPL vs PSL షెడ్యూల్ క్లాష్‌కు అవకాశం కనిపిస్తోంది. రెండు ప్రముఖ T20 లీగ్‌లు ఒకే సమయంలో జరిగితే ప్లేయర్ల లభ్యత, అంతర్జాతీయ క్రికెట్ క్యాలెండర్, ప్రేక్షకుల ఆసక్తి వంటి అంశాలు కీలకంగా మారనున్నాయి. PSL 2027లో మొత్తం ఎనిమిది జట్లు బరిలోకి దిగనున్నాయి. హైదరాబాద్ కింగ్స్‌మెన్, ఇస్లామాబాద్ యునైటెడ్, కరాచీ కింగ్స్, లాహోర్ ఖలందర్స్, ముల్తాన్ సుల్తాన్స్, పెషావర్ జల్మీ, క్వెట్టా గ్లాడియేటర్స్, రావల్పిండి జట్లు టైటిల్ కోసం పోటీపడనున్నాయి. గత సీజన్‌లో ఎనిమిది జట్ల ఫార్మాట్‌ను ప్రవేశపెట్టిన PCB.. PSL 12లోనూ అదే ఫార్మాట్‌ను కొనసాగిస్తోంది.

Auction, Retentionపై ఆసక్తి

PSL 12 Schedule ఖరారు కావడంతో ఇప్పుడు ఫ్రాంచైజీలకు సంబంధించిన కీలక ప్రక్రియలు వేగం పుంజుకోనున్నాయి. డైరెక్ట్ సైనింగ్స్, ప్లేయర్ల రిటెన్షన్స్, ట్రేడ్ విండో, ఆ తర్వాత PSL Players Auction వంటి కార్యక్రమాలు జరగనున్నాయి. గత సీజన్‌లో తొలిసారిగా ప్లేయర్ల డ్రాఫ్ట్ స్థానంలో Players Auction విధానాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. PSL 11లో ఫైనల్ మ్యాచ్‌కు భారీగా ప్రేక్షకులు హాజరయ్యారు. లాహోర్‌లోని గద్దాఫీ స్టేడియంలో జరిగిన ఫైనల్‌కు 32,461 మంది ప్రేక్షకులు వచ్చారు. పెషావర్ జల్మీ తొమ్మిదేళ్ల నిరీక్షణకు తెరదించుకుని టైటిల్‌ను సొంతం చేసుకుంది. దీంతో Pakistan Super Leagueకు దేశంలో పెరుగుతున్న క్రేజ్‌పై PCB మరింత దృష్టి పెట్టింది.

PCB చీఫ్ కీలక వ్యాఖ్యలు

PSL 12ను మరింత ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నామని PCB చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ తెలిపారు. గత సీజన్‌లో వచ్చిన భారీ స్పందన, రికార్డ్ క్రౌడ్స్, ప్రసారాల ఆదరణను ప్రస్తావిస్తూ.. PSL 2027ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ఇప్పుడు అసలు ఆసక్తి మాత్రం PSL vs IPL Clashపైనే ఉంది. రెండు టోర్నీల తేదీలు ఎంతవరకు ఓవర్లాప్ అవుతాయి? స్టార్ ప్లేయర్లు ఏ లీగ్‌కు అందుబాటులో ఉంటారు? అనే అంశాలపై రాబోయే రోజుల్లో మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు