పూజల హరికృష్ణ నాయకత్వంలో ఢిల్లీకి సిద్దిపేట కాంగ్రెస్ శ్రేణులు

30-10-2026 | 11:14pm

నవంబర్ 1న రామ్‌లీలా మైదానంలో ‘ఓటు చోరీ’ వ్యతిరేక ర్యాలీ

సిద్దిపేట రూరల్: ఓటు హక్కు, రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణ లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘ఓటు చోరీపై కదం తొక్కుదాం – చలో ఢిల్లీ’ కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్దిపేట కాంగ్రెస్ శ్రేణులు ఢిల్లీకి బయలుదేరాయి. నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి పూజల హరికృష్ణ నాయకత్వంలో నవంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిర్వహించనున్న ర్యాలీలో పాల్గొననున్నారు. ఎన్నికల ప్రక్రియలో అక్రమాలపై బాధ్యత వహిస్తూ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీనామా చేయాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ కార్యక్రమంలో బొమ్మల యాదగిరి, రషద్, వాహబ్, రంగు అశోక్, కరుణాకర్ భాగన్న, ప్రసాద్ తదితరులు బయలుదేరారు.

మరిన్ని వార్తలు