గణేష్ దేవస్థానం టెండర్లలో రూ.17.10 లక్షల ఆదాయం
27-10-2026 | 12:06am
పటాన్ చెరు, అక్టోబర్ 26: రుద్రారం శ్రీ గణేష్ దేవస్థానం(Rudraram Sri Ganesh Temple)లో ఈరోజు ఉదయం 11:30 గంటలకు 2026–27 సంవత్సరానికి సంబంధించి షాపుల టెండర్లు నిర్వహించారు. పూజా సామగ్రి విక్రయ హక్కును రూ.9.85 లక్షలకు రుద్రారం వాసి తలారి శేఖర్ దక్కించుకోగా, పూలు, పూలదండల విక్రయ హక్కును రూ.7.25 లక్షలకు గడ్డమీద శ్రీనివాస్ దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగారావు, కార్యనిర్వహణ అధికారి ఎన్. లావణ్య, మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి, కౌన్సిలర్ పి. వెంకట్, ఇస్లాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్, గ్రామ పెద్దలు, ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.