ఘనంగా మంత్రి పొంగులేటి ముందస్తు జన్మదిన వేడుకలు
27-10-2026 | 12:02am
కూసుమంచి, అక్టోబర్ 26 (విజయక్రాంతి): రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) జన్మదిన వేడుకలను గొరిల్లపాడు తండ గ్రామంలో నాయకులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అభిమానుల మధ్య కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.