CEIR పోర్టల్ ద్వారా ఐదు మొబైల్ ఫోన్లు రికవరీ
26-10-2026 | 11:48pm
- బోధన్‌లో బాధితులకు మొబైల్ ఫోన్ల అందజేత
బోధన్, అక్టోబర్ 26 (విజయక్రాంతి): బోధన్ పట్టణంలోని CEIR (సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) పోర్టల్ ద్వారా బోధన్ పోలీసులు(Bodhan Police) ఐదు మొబైల్ ఫోన్లను రికవరీ చేసి, వాటిని సంబంధిత బాధితులకు అందజేశారు. మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు CEIR పోర్టల్‌లో వివరాలు నమోదు చేసుకోవడం ద్వారా తమ ఫోన్లను తిరిగి పొందే అవకాశం ఉందని పోలీసులు సూచించారు.
మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్నవారు సంబంధిత వివరాలతో పోలీసులను సంప్రదించాలని, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఫోన్లను గుర్తించేందుకు చర్యలు తీసుకుంటామని బోధన్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ తెలిపారు.