వాల్మీకి మహర్షి ఆశయాలు స్ఫూర్తిదాయకం

27-10-2026 | 12:21am

- మాజీ ఎమ్మెల్యే మర్రి. 

నాగర్‌ కర్నూల్, అక్టోబర్ 26 (విజయక్రాంతి): వాల్మీకి మహర్షి ఆశయాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి(Ex MLA Marri Janardhan Reddy) అన్నారు. సోమవారం మండలంలోని గుడిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఆదికవి వాల్మీకి మహర్షి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

రామాయణం ధర్మం, సత్యం, న్యాయం, మానవీయ విలువలను బోధించే గొప్ప ఇతిహాసమని పేర్కొన్నారు. యువత వాల్మీకి మహర్షి ఆశయాలను ఆదర్శంగా తీసుకుని విద్య, క్రమశిక్షణ, సేవాభావంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, వాల్మీకి సంఘం నాయకులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యువకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు