లెక్చరర్లపై విష ప్రచారం ఆపండి..

26-10-2026 | 11:56pm

లెక్చరర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు..

బోథ్. అక్టోబర్ 26 (విజయక్రాంతి): కాంట్రాక్ట్ నుంచి క్రమబద్ధీకరించబడ్డ జూనియర్ లెక్చరర్(Junior Lecturers)పై కొంతమంది సామాజిక మాధ్యమాలలో విష ప్రచారం చేస్తున్నారని ఇది సరైనది కాదని తెలంగాణ గజ్వేల్ లెక్చరర్ సంఘం జిల్లా అధ్యక్షులు పన్నాల సంజీవరెడ్డి పేర్కొన్నారు.

సోమవారం ఆయన విజయక్రాంతితో మాట్లాడుతూ ఎలాంటి ఆధారాలు లేకుండా కొంతమంది తప్పుడు ప్రచారానికి పాల్పడం బాధాకరంగా ఉందన్నారు. అధ్యాపకులపై కొన్ని చానల్లో మరికొంతమంది వ్యక్తులు నకిలీ సర్టిఫికెట్ల తో ఉద్యోగాలు సంపాదించారని ఆరోపించడం విష ప్రచారమేనని పేర్కొన్నారు ఈ విషయాన్ని టిజిఎల్ఏ తీవ్రంగా ఖండిస్తుందన్నారు తీవ్రమైన ఆరోపణలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని హితవు పలికారు. కొంతమంది తప్పు చేస్తే అందరిపై ఆరోపణలు చేయడం సరైనది కాదన్నారు.

2013కు ముందు ఇతర రాష్ట్రాల్లో రెగ్యులర్ లేదా దూరవిద్య ద్వారా చదివిన అధ్యాపకులు ఉద్యోగాలు పొందడంలో తప్పు లేదన్నారు అప్పట్లో ఉన్న టెరిటోరియల్ జుడీసీఎల్ నిబంధన ప్రకారం అందరూ అర్హులేనన్నారు. ఈ విషయాన్ని అప్పటి ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి స్పష్టం చేశారనే విషయాన్ని గుర్తు చేశారు. సంబంధిత తీర్పు ప్రభుత్వ ఉత్తర్వులు హైకోర్టు ఆదేశాల పరి దిని పరిగణలోకి తీసుకోకుండా అనవసరమైన ప్రచారం చేయడం తగదన్నారు. వెరిఫికేషన్ ప్రక్రియను నిర్దిష్ట కాల పరిమితితో పూర్తిచేసి ప్రతికూల నివేదికలు లేని అర్హులైన అధ్యాపకులకు ప్రొఫెషన్ డిక్లరేషన్ ప్రకటించాలని పెండింగ్ ఇంక్రిమెంట్లు సీనియార్టీ ఇతర ప్రయోజనాలను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు