ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పోషణ మాస కార్యక్రమం
మునిపల్లి సెప్టెంబర్25 : ( విజయ్క్రాంతి) : పోషణ మాస కార్యక్రమంలో(Nutrition Month Program) భాగంగా మండల పరిధిలోని పెద్దచెల్మెడ రైతు వేదికలో(Peddachelmeda Rythu Vedika) శుక్రవారం పోషణ మాస అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సదాశివ పేట సిడిపిఓ చంద్రకళ(Sadashivapet CDPO Chandrakala) పాల్గొని మాట్లాడారు. పిల్లల శారీరక(Childrens physical), మానసిక ఎదుగుదలకు అవసరమైన పిండి పదార్థాలు, ప్రొటీన్లు, విటమిన్ల వంటి పోషకాలన్నీ అంగన్వాడీలో లభించే బాలామృతం , గుడ్లు, పాలు తదితర పదార్థాలలో ఉంటాయన్నారు. అందుకు గర్భిణీ స్త్రీలు , పిల్లలు అంగన్వాడి కేంద్రాలను ఉపయోగించుకొని పోషకాహారాన్ని తీసుకోవాలన్నారు.
అంతకుముందు పోషణ మాసం సందర్భంగా తల్లి, పిల్లలకు పోషకాహారంపై అవగాహన కల్పించి వాటి యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్లు శైలజ, జ్యోతి, గ్రామ సర్పంచ్ రాధాబాయి జోషి, ఉప సర్పంచ్ ఖాజామైనోద్దీన్ , పోషణ్ అభియాన్ బ్లాక్ కో ఆర్డినేటర్ లక్ష్మణ్, సి హెచ్ ఓ చంద్రభాను, అంగన్వాడీ టీచర్లు రేణుక రెడ్డి, శాంతమ్మ, లక్ష్మీ, సెక్టార్ , టీచర్లు, ఆశా వర్కర్,ఆయాలు, గర్భిణి, బాలింతలు, వైద్య సిబ్బంది, పిల్లల తల్లితండ్రులు తదితరులు పాల్గొన్నారు.