మట్టి గణపతులను ప్రోత్సహించాలి
12-09-2026 | 10:11pm
గణేష్ ఉత్సవ నిర్వాహకులతో వీర్నపల్లి ఎస్ఐ సమావేశం
వీర్నపల్లి,(విజయక్రాంతి): వినాయక నవరాత్రి ఉత్సవాలను(Vinayaka Navratri Celebrations) ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వీర్నపల్లి మండలంలోని గ్రామాల గణేష్ ఉత్సవ నిర్వాహకులతో వీర్నపల్లి ఎస్ఐ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలను(Ganesh Utsav) శాంతియుతంగా నిర్వహించాలని, నిర్వాహకులు పోలీసుల సూచనలు పాటించాలని తెలిపారు. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మండపాల వద్ద భద్రతా చర్యలు చేపట్టడంతో పాటు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉత్సవాలను నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీర్నపల్లి ఎస్ఐతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.