అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలకు ఘన సత్కారం

06-10-2026 | 09:12pm

కోనరావుపేట అక్టోబర్ 6 (విజయక్రాంతి):ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా నిర్వహిస్తున్న ‘సేవా పఖ్వాడా’(Seva Pakhwada (Fortnight of Service)) సేవా పక్షోత్సవాల్లో భాగంగా కోనరావుపేట మండలంలో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ‘అంగన్ సేవా మిలన్’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు తీగల జయశ్రీ ఆధ్వర్యంలో కోనరావుపేట, వెంకట్రావుపేట, మల్కాపేట, శివంగలపల్లి గ్రామాల్లో సేవలందిస్తున్న అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు, ఆశా కార్యకర్తలను శాలువాలతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమానికి బీజేపీ మండల అధ్యక్షుడు మిర్యాల్‌కార్ బాలాజీ, మహిళా మోర్చా రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఆయా గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం అందించడంతో పాటు ప్రజలకు ఆరోగ్య సేవలు, సంక్షేమ పథకాలను చేరువ చేయడంలో అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తల పాత్ర కీలకమని అన్నారు.పోషణ్ అభియాన్ మిషన్ ఇంద్రధనుష్ వంటి కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో విజయవంతం కావడంలో వారి సేవలు అభినందనీయమని కొనియాడారు.

తమ సేవలను గుర్తించి సత్కరించడం పట్ల అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి బైరగోని సురేష్ గౌడ్, మండల ఉపాధ్యక్షులు చింతల పరశురాములు, తీగల రవీందర్ గౌడ్, వెలుపల మహిపాల్, శ్రీనివాస్, రవీందర్ రెడ్డి, మనక మల్లవ్వతో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు